Surya vs Surya Movie Latest Stills | Nikhil Siddhartha

Posted : February 3, 2015 at 11:16 pm IST by ManaTelugu


ఎక్స్‌ బీఎఫ్‌పై ఎక్స్‌ట్రా ఫోకస్‌

Posted : January 5, 2015 at 10:45 pm IST by ManaTelugu
సైఫ్‌ అలీఖాన్‌ని పెళ్ళాడిన తర్వాత కరీనాకపూర్‌ని ‘బేగం’ అంటున్నారు బాలీవుడ్‌లో. ఈ బేగం మాజీ బాయ్‌ఫ్రెండ్‌ షాహిద్‌ కపూర్‌ మీద ఎక్స్‌ట్రా ఫోకస్‌ పెట్టిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూసేస్తోంది. షాహిద్‌ కపూర్‌తో కలిసి వర్క్‌ చేయాలని కరీనాకపూర్‌ ఉబలాటపడ్తోందట. షాహిద్‌ కపూర్‌, కరీనాల పెళ్ళి జరగబోతోందని గతంలో గాసిప్స్‌ వచ్చిన చాలా కాలం తర్వాత వారిద్దరూ బ్రేకప్‌ అయ్యారు.
‘ఉడ్తా పంజాబ్‌’ అనే సినిమాతో షాహిద్‌, కరీనాకపూర్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయనుందట. పెళ్ళయినా, ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయడంలో కరీనా ఏమాత్రం తగ్గటంలేదు. అయితే ఎక్స్‌బాయ్‌ఫ్రెండ్‌తో బేగం రొమాన్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంకో వైపున అలియా భట్‌ కూడా ఈ సినిమాలో నటించనుంది. అలియా క్యూట్‌ గ్లామర్‌ ముందు కరీనా గ్లామర్‌ తేలిపోతుందని అంటున్నారంతా. బేగం మాత్రం, పెళ్ళయినా తనలో గ్లామర్‌ తగ్గలేదని చెబుతోంది.

హాట్‌ ఫోటో: ఇలియానా ఒంపు సొంపులు..!

Posted : December 2, 2014 at 12:36 pm IST by ManaTelugu
ఇలియానా జీరో సైజ్‌ ఫిజిక్‌కి గుడ్‌బై చెప్పేసి… కర్వ్స్‌కి వెల్‌కమ్‌ చెప్పింది. కొన్నాళ్ల క్రితం వరకు తన ఛార్మ్‌ కోల్పోయి… పీలగా అదోలా కనిపించిన ఇలియానా ఇప్పుడు నిండుగా మెరిసిపోతోంది. ఒంపుసొంపులున్న అమ్మడు సెక్సీగా కనిపించాలంటే రివీలింగ్‌ కాస్టూమ్స్‌ కూడా వేసుకోవాల్సిన పని లేదని ఇలియానా ఈ ఫోటోలో చూపిస్తోంది. 
టైట్‌ ఫిట్‌ మినీ గౌన్‌లో ఆమె బికినీ పిక్‌ ఎఫెక్ట్‌కి ఏమాత్రం తీసిపోని రిజల్ట్‌ రాబట్టింది. ఇలియానాని ఇప్పుడిలా చూస్తుంటే మళ్లీ ఆమె కిక్‌ రోజులు గుర్తొస్తున్నాయి. ఎవరైనా మళ్లీ ఈ గోవా కోవాని తెలుగు తెర మీదకి తెస్తే ఫాన్స్‌కి మళ్లీ పండగ టైమొస్తుంది.

తెలంగాణకు తిరుపతి వెంకన్న నిధుల్లో వాటా కావాలంట..!

Posted : November 25, 2014 at 5:45 pm IST by ManaTelugu
ఆంధ్రప్రదేశ్ విభజనతో ప్రాంతాలు, మనుషులు, మనసులు, సంస్థలు రెండుగా విడిపోయాయి. ఈ విభజన అంతటితో ఆగలేదు. చివరకు దేవుళ్లని కూడా ఆంధ్రాదేవుడు తెలంగాణ దేవుడు అని పిలుచుకునే పరిస్థితి వచ్చింది. ఎందులో ఎలా ఉన్నా.. దేవుళ్ల విషయానికి వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాదే పైచేయని చెప్పక తప్పదు. కలియుగ వైకుంఠంగా పేరుపొందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దైవక్షేత్రాలు.. అలాగని తెలంగాణలో దేవుళ్లకు తక్కువేమీ లేకున్నా.. పోలిస్తే మాత్రం ఈ విషయంలో ఆంధ్రాదే పైచేయి. 
ఆ లోటు పూడ్చేందుకే కేసీఆర్.. ఆ మధ్యన యాదగిరిగుట్టను వాటికన్ సిటీలా తీర్చిదిద్దుతామన్నారు. విభజన సమయంలో గట్టిగా పోరాడకపోతే.. భద్రాచల రామయ్య కూడా ఆంధ్రావైపునకు వెళ్లేవాడే. దేవుళ్ల విషయం సంగతి అలా ఉంచితే.. తిరుపతి వెంకన్న నిధుల్లో వాటా కావాలంటూ కొందరు తెలంగాణవాదులు వాదన వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి తెలంగాణకు దాదాపు వెయ్యికోట్ల రూపాయల నిధులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ దేవాలయాల పరిరక్షణ సంఘం సభ్యులు సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రం విడిపోయాక ఇక తిరుపతి వెంకన్న నిధులు తెలంగాణకు ఎందుకు వస్తాయనేగా మీ సందేహం. 
అసలు విషయం ఏమిటంటే.. రాష్ట్రం విడిపోక ముందు ఉన్న ఒక చట్టం ప్రకారం.. పెద్ద దేవాలయాలు.. చిన్న గుళ్ల అభివృద్ది కోసం ఏటా కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఐతే కొన్నేళ్లుగా టిటిడి ఈ సొమ్ములు చెల్లించడం లేదట. టీటిడి.. ఇలా బకాయి పడ్డ సొమ్ము దాదాపు 2వేల కోట్ల పైమాటేనంట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి బకాయి కాబట్టి.. ఆ సొమ్ముపై తమకూ హక్కు ఉంటుందంటున్నారీ తెలంగాణవాదులు.. విభజన చట్టం ప్రకారం 42శాతం వాటా ప్రకారం తెలంగాణదేవాదాయ శాఖకు టీటీడీ వెయ్యి కోట్ల రూపాయలు వస్తాయట. ఆ సొమ్ము రప్పించేందుకు కృషి చేయమని వారు కోరుతున్నారు. వీరికి నాయకత్వం వహిస్తున్నది చిలుకూరు బాలాజీ ఆలయపూజారి సౌందరరాజన్ కావడం విశేషం.

సమంత ను భయపెడుతున్న సరోజ!

Posted : September 19, 2014 at 4:14 am IST by ManaTelugu

sam

తన ట్విటర్ ద్వారా అందరి పై హాట్ కామెంట్లు చేసే సమంతను సరోజ భయ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సరోజ ఎవరో కాదు మన తమన్నా. ‘ఆగడు’ సినిమాలో తమన్నా పాత్ర పేరు ఇది. ప్రస్తుతం చాలామంది సెల్ ఫోన్స్ కు ‘తూ ఆజా సరోజ’ సాంగ్ కాలర్ ట్యూన్ గా మారిపోవడం సమంతను షేక్ చేస్తోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి.

‘ఆగడు’ సినిమా కోసం మహేష్, తమన్నాల పై చిత్రీకరించిన ఈ పాట ఆ సినిమాకు హైలెట్ కావడమే కాకుండా ఈ పాటలో మహేష్, తమన్నాల రొమాంటిక్ యాంగిల్ టాప్ లేపుతుందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ సమంతను టార్చర్ పెడుతున్నాయని టాక్.

గత నెలలో సమంత నటించిన రెండు భారీ సినిమాలు అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ఘోరంగా ఫ్లాప్ కావడం సమంత హవాకు బ్రేక్ వేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ‘ఆగడు’ సూపర్ హిట్ కొడితే సమంత నెంబర్ వన్ స్థానానికి మిల్కీ బ్యూటీ గండి కొట్టడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

అయితే సెంటిమెంట్ రీత్యా వరస పరాజయాలను చూసిన తమన్నా ఆ సెంటిమెంట్ ను ఎదిరించి నిలబడగలదా అన్నదే సందేహం.